jagapathibabu: నాకు డబ్బు పిచ్చిలేదు .. నన్ను చాలా ఈజీగా మోసం చేయవచ్చు!: జగపతిబాబు

షార్ట్స్‌లో చూడండి
జగపతిబాబు మొదటి నుంచి కూడా అందరినీ నమ్మేస్తూ వుంటారు. డబ్బు కన్నా స్నేహం గొప్పదనే ఉద్దేశంతో ఆయన చాలామందికి సాయం చేస్తూ వచ్చారు. ఆర్థికపరమైన విషయాల్లో ఇతరులకు అండగా నిలబడుతూ వచ్చారు. ఈ కారణంగా ఆయన ఆర్థికంగా చాలా నష్టపోయారు. ఇదే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో ఆయన ప్రస్తావించారు.

"మొదటి నుంచి కూడా నాకు డబ్బు పిచ్చి లేదు. అందువలన డబ్బుకి అంతగా ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదు. నాకు తెలిసిన కొంతమందికి విపరీతమైన డబ్బు పిచ్చి వుంది. వాళ్లు మంచి బట్టలు కూడా వేసుకోరు .. జీవితాన్ని హ్యాపీగా గడపలేరు. అలాంటి వాళ్లకి ఎన్ని కోట్లు వుండి ఏం లాభం? డబ్బు విషయంలో నేను మోసపోయాను .. నన్ను చాలా ఈజీగా మోసం చేయవచ్చు .. అది నా తప్పేనని ఒప్పుకుంటాను.

 అయితే డబ్బున్నది ఎంజాయ్ చేయడానికే కాదు .. అది లేని వాళ్లకి సాయపడటానికి కూడా. ఆ ఉద్దేశంతోనే నేను సాయపడ్డానని అనుకుంటాను. నా కూతురు పెళ్లి సమయానికి నా దగ్గర డబ్బు లేదనీ .. అందుకే ఘనంగా చేయలేకపోయాననే బాధ కూడా నాకు లేదు. జీవితమంటే అనుభవాలను పాఠాలుగా నేర్చుకుంటూ వెళ్లడమేనంటూ ఆయన చెప్పుకొచ్చారు.      
Go Back to Shorts
jagapathibabu

More Telugu News