jagapathibabu: ఒక నిర్మాత వారం రోజుల పాటు నాకు భోజనమే తెప్పించలేదు: జగపతిబాబు

షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరపై యాక్షన్ హీరోగా .. ఫ్యామిలీ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న కథానాయకుడు జగపతిబాబు. అలాంటి జగపతిబాబు .. హీరోగా అవకాశాలు తగ్గడంతో, విలన్ వేషాల వైపు టర్న్ తీసుకున్నారు. కేరక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పుడు ఆయన చాలా బిజీ. అలాంటి జగపతిబాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు.

"సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమా ఛాన్సులు వస్తాయేమోనని ఫోన్లు పట్టుకుని తిరిగిన సందర్భాలు వున్నాయి. సినిమా ఛాన్స్ కి సంబంధించిన ఫోన్ కాల్ వస్తే అదొక అద్భుతమని నాకు అనిపించేది. అలాంటి నా చేతిలో ఇప్పుడు 13 సినిమాలు వున్నాయి. మా నాన్న పెద్ద నిర్మాత .. నేను కాదు. అందువలన ఒక చిన్న సినిమా నిర్మాత తన సినిమాలో ఒక చిన్నవేషం కోసం నన్ను అడిగితే అందులో తప్పేం లేదనే నేను అనుకుంటాను. ఒక నిర్మాత అయితే షూటింగులో నాకు కుర్చీ కూడా వేయలేదు .. మరో నిర్మాత వారం రోజుల పాటు భోజనం తెప్పించలేదు" అంటూ గతంలో జరిగిన సంఘటనలను జగపతిబాబు గుర్తు చేసుకున్నారు.   
Go Back to Shorts
jagapathibabu

More Telugu News