యువతలో రక్తపోటు పెరగడానికి మరో కారణం.. పాస్పేట్!
- పాస్పేట్ పెరగడం వల్ల నిమిషానికి నాలుగుసార్లు ఎక్కువ కొట్టుకుంటున్న గుండె
- కాఫీ, వెన్న, నిల్వవున్న ఆహారం ద్వారా శరీరంలోకి చేరుతున్నట్లు గుర్తింపు
- బీపీ పెరిగి మూత్రపిండాల వ్యాధిన పడే అవకాశం
కాఫీ ఎక్కువగా తీసుకోవడం, వెన్నపూసిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన మాంసంలో పాస్పేట్ అధికంగా ఉంటుంది. 'శరీరం రోజుకి సగటున 700 మిల్లీ గ్రాముల వరకు పాస్పేట్‌ను స్వీకరించగలదు. అంతకు మించితే అది రక్త నాళాల్లో పేరుకుపోతుంది. దీంతో బీపీ పెరిగి మూత్రపిండాల వ్యాధి బారిన పడే అవకాశం ఉంది’ అని పరిశోధనా బృందాన్ని ఉటంకిస్తూ అమెరికా సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ జర్నల్ ప్రచురించింది. రక్తంలో పేరుకుపోయిన పాస్పేట్‌ను కరిగించేందుకు విటమిన్-డి శరీరానికి అవసరమని, ఇందుకోసం నీరెండలో కాసేపు తిరిగితే మంచిదని సూచించింది.