స్విట్జర్లాండ్ లో నీటి కొరతతో కరవు కరాళనృత్యం!
- స్విట్జర్లాండ్ లో వందేళ్ళలో ఎన్నడూ లేనంత కరవు
- నీటి వినియోగంపై ఆంక్షలు పెట్టిన స్విస్ సర్కారు
- హెలికాఫ్టర్ ద్వారా నీటిని పోసి కొండ ప్రాంతాల్లో గడ్డిని కాపాడే యత్నం
కార్ వాషింగ్ కు, స్విమ్మింగ్ పూల్స్ కు, గార్డెనింగ్ కు నీరు వృథా చేయద్దని హెచ్చరించింది. అయితే, నీటి లభ్యత ఎక్కువగా వున్న చోట కొంతమేర నిబంధనలను స్విస్ సర్కార్ సడలించింది. అలాగే నదులు, సరస్సుల్లో నీటి మట్టం పడిపోవటంతో విదేశీ పడవల రాకను పరిమితం చేసింది. ఇక పశువులను రక్షించేందుకు పశుగ్రాసం కోసం పడరాని పాట్లు పడుతోంది. కరవుతో గడ్డి దొరక్కపోవటంతో అక్కడి ఆర్మీ అధికారులు వెస్ట్ స్విట్జర్లాండ్ లోని కొండ ప్రాంతంలో ఉన్న గడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం హెలికాఫ్టర్ల ద్వారా నీటిని తరలించి వర్షంలా కురిపిస్తున్నారు. పెద్ద పెద్ద బ్యాగులతో నీటిని పోసి గడ్డి ఎండిపోకుండా కాపాడుతున్నారు. పశువుల ప్రాణాలను కాపాడేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు.