ప్రజలను అభివృద్ధికి దూరం చేస్తే ఐసిస్ లాంటి సంస్థలు పుడతాయ్!: కాంగ్రెస్ నేత రాహుల్ హెచ్చరిక
- దళిత, ఆదివాసీ, మైనారిటీలపై కేంద్రం వివక్ష
- మూకహత్యలకు నిరుద్యోగం ఓ కారణమే
- జర్మనీలోని హాంబర్గ్ లో రాహుల్ ప్రసంగం
జర్మనీలోని హాంబర్గ్ లో ఉన్న బుసెరియస్ సమ్మర్ స్కూల్ లో జరిగిన ఓ సదస్సులో రాహుల్ మాట్లాడారు. 21వ శతాబ్దంలో ప్రజలను అభివృద్ధికి దూరం చేయడం సరికాదని రాహుల్ అన్నారు. దేశంలో నిరుద్యోగం, పేదలకు అవకాశాల లేమి కారణంగా ఏర్పడుతున్న ఆగ్రహంతోనే మూకహత్యలు జరుగుతున్నాయని అన్నారు. పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కారణంగా దేశంలో చిన్న, మధ్యతరహా వ్యాపారాలు పూర్తిగా నాశనమయ్యాయని రాహుల్ ఆరోపించారు.