ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురి గొంతు కోసేసిన తండ్రి!: తెలంగాణలో పరువు హత్య
- అబ్దుల్లాపూర్ మెట్ లో దారుణం
- నాలుగేళ్ల క్రితం విజయ ప్రేమ వివాహం
- ఆగ్రహంతో హత్యచేసిన తండ్రి
అబ్దుల్లాపూర్ మెట్ ఎస్సీ కాలనీకి చెందిన విజయ వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తిని నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ఈ దంపతులు ఊరి నుంచి దూరంగా వెళ్లి బతుకుతున్నారు. ఇటీవల తన అత్త చనిపోవడంతో విజయ సొంత ఊరికి వచ్చింది.
ఈ విషయం తెలుసుకున్న విజయ కుటుంబ సభ్యులు అక్కడకు వచ్చి గొడవ పెట్టుకున్నారు. అయితే ఈ పెళ్లి వ్యవహారంతో ఊర్లో తన పరువు పోయిందని భావించిన తండ్రి విజయను కిరాతకంగా గొంతు కోసి హతమార్చాడు. అనంతరం పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు.