Chandrababu: ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేయగల నేత చంద్రబాబు: గల్లా జయదేవ్

షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం చంద్రబాబుపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రశంసలు కురిపించారు. నాడు కాంగ్రెస్ పార్టీతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధం గురించి ఆయన గుర్తుచేసుకున్నారు. అమరావతిలో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్యం రాకముందు నుంచి తమ కుటుంబం రాజకీయాల్లో ఉందని, తమ తాత, అమ్మ నాడు ‘కాంగ్రెస్’ పార్టీలో ఉన్నవారేనని అన్నారు. అయితే, హేతుబద్ధత లేకుండా రాష్ట్ర విభజన చేయడంతో ఆవేదన చెందిన తన తల్లి కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చిందని అన్నారు. ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేయగల నేత చంద్రబాబు అని, అందుకే, తమ కుటుంబం టీడీపీలో చేరిందని అన్నారు.
Go Back to Shorts
Chandrababu
galla jaya dev

More Telugu News