అచ్చం సినిమా కథే... పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన విద్యార్థుల లవ్ మేరేజ్... ఒంగోలు వద్ద పది రోజుల కాపురం!
- రెండేళ్లుగా ప్రేమలో 15 ఏళ్ల బాలుడు, బాలిక
- పెళ్లికి ఒప్పుకోరని, ఇంట్లో దొంగతనం చేసి ఒంగోలుకు
- గుడిలో పెళ్లి చేసుకుని కాపురం
- కౌన్సెలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు
సినిమాల ప్రభావంతో తాము రెండేళ్లుగా ప్రేమలో ఉన్నామని, తమ పెళ్లికి పెద్దలు అంగీకరించబోరన్న భయంతో, కొంత డబ్బు తీసుకుని పారిపోయి వచ్చామని వారు చెప్పారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించిన చైల్డ్ లైన్ సిబ్బంది, తల్లిదండ్రులకు సమాచారాన్ని ఇచ్చారు.