nayanatara: ఇప్పట్లో నయనతారకి తిరుగులేనట్టే .. మరోసారి భారీ హిట్

షార్ట్స్‌లో చూడండి
తమిళనాట నయనతారకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. కొంతకాలంగా నటనకి ఎక్కువ ప్రాధాన్యత గల సినిమాలను చేస్తూ .. తన స్థాయిని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వెళుతోంది. ఆమె తాజా చిత్రంగా రూపొందిన 'కొలమావు కోకిల' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ కథా భారాన్ని నయనతార పూర్తిగా తనపై వేసుకుని ముందుకు నడిపిస్తూ వెళ్లింది. తొలిరోజునే ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ టాక్ తెచ్చేసుకుంది.

నయనతార నటన పట్ల అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'లేడీ సూపర్ స్టార్' అనే బిరుదును ఈ సినిమాతో ఆమె సార్థకం చేసుకుందంటూ అభినందనలు తెలియజేస్తున్నారు. 25 కోట్ల రూపాయల ఖరీదు చేసే డ్రగ్స్ ను తన కుటుంబ సభ్యులతో కలిసి నయనతార ఎలా తరలించిందనే కథాంశంతో ఈ సినిమా కొనసాగుతుంది. కావలసినంత కామెడీని కలుపుకుని సాగే థ్రిల్లర్ మూవీ ఇది. త్వరలో 'కో కో కోకిల' అనే పేరుతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.   
Go Back to Shorts
nayanatara

More Telugu News