Tirumala: తిరుమల శ్రీవారి సేవా టికెట్లలో కుంభకోణం!
తిరుమల శ్రీవారి సేవా టికెట్లలో కుంభకోణం బయటపడింది. ఆన్ లైన్ డిప్ లో సేవా టికెట్లు పొంది వాటిని భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్న సంఘటన తాజాగా వెలుగు చూసింది. నకిలీ ఆధార్ కార్డులతో భక్తులు దర్శనానికి వెళ్తుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి షోలాపూర్ కు చెందిన ప్రభాకర్ ను విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాదిలో ఈ విధంగా 1200 సేవా టికెట్లను విక్రయించినట్టు అధికారులు గుర్తించారు.