పాకిస్తాన్ స్పీకర్ గా పీటీఐ అభ్యర్థి అసద్ ఖైజర్ ఎన్నిక!
- పాకిస్తాన్ స్పీకర్‌గా ఇమ్రాన్ స్నేహితుడు అసద్ ఖైజర్
- సీక్రెట్ బ్యాలెట్ లో ౩౦ ఓట్ల మెజార్టీతో స్పీకర్ గా బాధ్యత చేపట్టిన అసద్ ఖైజర్
- పీపుల్స్ పార్టీ సయ్యద్ ఖుర్షీద్ పై విజయం
ఇప్పటివరకు స్పీకర్‌గా ఉండి నిష్క్రమిస్తున్న ఆయజ్ సాదిక్ పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ సభాపతిగా ఖైజర్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఖైజర్ విపక్ష నేతలకు కరచాలనం చేశారు. కొత్తగా ఎన్నికైన స్పీకర్ ప్రధాని ఎన్నికను పర్యవేక్షిస్తారు. దీంతో అధికార మార్పిడి తంతు లాంఛనంగా ప్రారంభమైంది. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా శనివారం ప్రమాణం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన ఖైజర్ త్వరలో ప్రధానిగా బాధ్యత చేపట్టనున్న ఇమ్రాన్ ఖాన్ స్నేహితుడు కావటం విశేషం .