సిల్క్ స్మిత నన్ను తప్పించాలనుకుంది .. ఆమెనే ఆ మూవీ నుంచి తప్పించారు: శివశంకర్ మాస్టర్
- సిల్క్ స్మిత నన్ను ఎవైడ్ చేశారు
- నాకు చాలా బాధ అనిపించింది
- ఆ పాట ఆమె కాకుండా జయమాలిని చేసింది
బాలకృష్ణ హీరోగా వచ్చిన 'భలే తమ్ముడు' సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో నాలుగు పాటలకి నేను కొరియోగ్రఫీ చేశాను .. ఐదవ పాట సిల్క్ స్మితతో .. రిహార్సల్స్ కూడా చేసేశాను. రిహార్సల్స్ చేసి ఇంటికి వస్తుండగా కంపెనీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. 'మీకు .. స్మితకు గొడవేంటి? మీరుంటే స్మిత చేయనంటోంది' అని చెప్పారు. మీతో చేయదట .. వేరే కొరియోగ్రఫర్ ను ఆమె సిఫార్సు చేస్తున్నారు అని అన్నారు.
తెల్లవారితే షూటింగ్ .. స్మిత అలా అన్నదని తెలిసి చాలా బాధపడ్డాను. అప్పుడు ప్రొడ్యూసర్ గారు .. 'శివ శంకర్ మాస్టర్ గారే ఈ సాంగ్ చేయాలి .. స్మితకు ఇష్టం లేకపోతే వేరే వాళ్లను పెట్టండి' అన్నారు. దాంతో స్మిత తీసుకున్న అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేయవలసి వచ్చింది .. జయమాలినితో ఆ పాట చేయడం జరిగింది" అని చెప్పుకొచ్చారు.