నువ్వు నోరుముయ్యకుంటే...శాశ్వతంగా నీ నోరు మూసేస్తాం!: విద్యార్థి నాయకురాలు షీలాకు మాఫియా డాన్ బెదిరింపు!
- ఖలీద్, జిగ్నేష్ లకూ ఇదే గతి
- రవి పుజారి నుంచి మెసేజ్
- పోలీసులకు షీలా ఫిర్యాదు

"నీ నోరు మూసుకో... లేకుంటే మేమే నీ నోరు శాశ్వతంగా మూసేస్తాం. ఇదే విషయాన్ని ఉమర్ ఖలీద్, జిగ్నేష్ మేవానీకి కూడా చెప్పు" అని తనకు మెసేజ్ వచ్చినట్టు ఆమె తెలిపారు. ఈ మేరకు ఆర్పీసీ సెక్షన్ 506 కింద 45/2018 యూ/ఎస్ కింద కేసు నమోదైందని షీలా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.