నాపై పథకం ప్రకారమే దాడి చేస్తున్నారు: అనుష్క శర్మ
- టీమిండియా ఆటగాళ్లకు భారత హైకమిషన్ ఇచ్చిన విందుకు హాజరైన అనుష్క
- వెల్లువెత్తుతున్న విమర్శలు
- లార్డ్స్ టెస్టులో ఓటమి అనంతరం మరింత పెరిగిన దాడి
ఈ నేపథ్యంలో అనుష్క శర్మ స్పందించింది. ఆ రోజు నిబంధనలకు అనుగుణంగానే విందు కార్యక్రమం జరిగిందని ఆమె తెలిపింది. ఆ కార్యక్రమంలో తాను ఎందుకు పాల్గొన్నాననే విషయాన్ని కూడా అధికారులు వివరించారని... అయినా తనపై విమర్శలు చేస్తూనే ఉన్నారని మండిపడింది. ఇదంతా ఒక పథకం ప్రకారమే తనపై జరుగుతున్న దాడి అని తెలిపింది. ఇలాంటి విమర్శలపై స్పందించాల్సిన అవసరం లేదని చెప్పింది.