ఆ భారీ చిత్రం భవిష్యత్తు గురించి తలచుకుంటే బాధేస్తోంది: అల్లు అరవింద్ షాకింగ్ వ్యాఖ్యలు
- విడుదలకు ముందే ఓ భారీ చిత్రం లీక్
- మరో రెండు సినిమాలు కూడా
- టాలీవుడ్ లో కొత్త చర్చకు తెరలేపిన అల్లు అరవింద్
అల్లు అరవింద్ నోటి నుంచి వచ్చిన మాటలతో, ముందే లీక్ అయిన సదరు భారీ చిత్రం ఏంటన్న చర్చ జరుగుతోంది. త్వరలో విడుదలకు సిద్ధమైన పెద్ద చిత్రాల్లో నాగార్జున, నాని నటించిన 'దేవదాసు'తో పాటు 'శైలజారెడ్డి అల్లుడు', 'సవ్యసాచి' తదితర చిత్రాలుండగా, ఎన్డీఆర్ 'అరవింద సమేత' సినిమా ఫొటోలు లీక్ అయ్యాయన్న సంగతి తెలిసిందే. అయితే, అరవింద్ చెప్పిన ఆ మూడు సినిమాలు ఏవన్న వివరాలు తెలియరాలేదు.