kcr: ఢిల్లీ కుటుంబపాలన కంటే మాదే నయం: రాహుల్ పై కేసీఆర్ సెటైర్

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అసత్య ప్రచారం చేశారని కేసీఆర్ మండిపడ్డారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం, ప్రగతిభవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ, తాము నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను అవసరమైతే రాహుల్ గాంధీకి చూపిస్తామని అన్నారు.

తెలంగాణలో కుటుంబపాలన నడుస్తోందని రాహుల్ చేసిన విమర్శలను ఈ సందర్భంగా కేసీఆర్ ప్రస్తావించారు. కుటుంబపాలన గురించి రాహుల్ మాట్లాడటం హాస్యాస్పదమని, ఢిల్లీ కుటుంబపాలన కంటే తమదే నయమని అన్నారు. ఢిల్లీ నుంచి ఆదేశాలు రానిదే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఏ నిర్ణయం తీసుకోలేరని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఏ పార్టీ నేతలైనా పర్యటించడం మామూలేనని, రాహుల్ గాంధీకి టీఆర్ఎస్ ఎప్పుడూ భయపడదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తన శక్తిసామర్థ్యాలను ఎప్పుడో కోల్పోయిందని, ఏ రాష్ట్రంలోనూ సొంతగా 20 సీట్లు గెలిచే స్థితిలో కాంగ్రెస్ లేదని అన్నారు.
Go Back to Shorts
kcr
Rahul Gandhi

More Telugu News