కోరిక తీర్చాలని యువతికి ఎస్ఐ వేధింపులు... ఆధారాలతో పట్టించిన వైనం!
- నిత్యమూ రాత్రి పూట వేధిస్తున్న ఆత్మకూరు ఎస్ఐ
- కాల్ రికార్డు, డేటాతో ఎస్పీకి ఫిర్యాదు
- వెంటనే విధుల నుంచి తొలగింపు
అవతలి నుంచి ఫోన్ చేస్తున్నది కర్నూలు జిల్లా ఆత్మకూరు పోలీసుస్టేషన్ ఎస్సై వెంకటసుబ్బయ్య. అతని వేధింపులు భరించలేకపోయిన ఆ మహిళ, ఫోన్ కాల్స్ రికార్డు, తన కాల్ డేటాను తీసుకుని డైరెక్టుగా కర్నూలు ఎస్పీ గోపీనాథ్ జట్టికి అందించి ఫిర్యాదు చేసింది. వెంటనే అతన్ని విధుల నుంచి తొలగించి వీఆర్ (వేకెన్సీ రిజర్వ్) కు పంపుతూ ఎస్పీ ఆదేశించారు. మొత్తం ఘటనపై విచారించి సమగ్ర నివేదికను అందించాలని అడిషనల్ ఎస్పీ మాధవరెడ్డిని ఆదేశించారు.