ఉగ్ర గోదావరి... ఒక్క రోజులో 11 అడుగులు పెరిగిన నీటిమట్టం!
- పొంగి పొరలుతున్న వాగులు, వంకలు
- 33 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- సాయంత్రానికి 40 అడుగులకు చేరే అవకాశం
నది వరద క్రమంగా స్నాన ఘట్టాలకు చేరుకోవడంతో, పుణ్య స్నానాలు ఆచరించేందుకు వచ్చిన రామ భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తాలిపేరు ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో గేట్లన్నీ ఎత్తివేశారు. సత్తుపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు ప్రవేశించడంతో 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 18.4 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టం ఉన్న వైరా రిజర్వాయర్ లో ప్రస్తుతం 18.2 అడుగుల మేరకు నీరు నిలిచివుంది. జన్నారం మండలంలో ఇందన్ పల్లి అప్రోచ్ వంతెన వరద నీటికి కొట్టుకుపోవడంతో 8 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.