akhil: అఖిల్ మూవీకి 'మిస్టర్ మజ్ను' టైటిల్ ఖరారు!

షార్ట్స్‌లో చూడండి
'తొలిప్రేమ'తో యూత్ నుంచి మంచి మార్కులు కొట్టేసిన దర్శకుడు వెంకీ అట్లూరి. ఆయన తన తదుపరి సినిమాను అఖిల్ తో చేస్తున్నాడు. క్లాస్ టచ్ తో స్టైలిష్ గా సాగే ప్రేమకథా చిత్రం ఇది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా కొంతకాలంగా 'లండన్' లో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తూ వస్తున్నారు.

ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి 'మిస్టర్ మజ్ను' అనే టైటిల్  ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అదే టైటిల్ ను ఖరారు చేశారనీ .. రిజిస్టర్ కూడా చేయించారనేది తాజా సమాచారం. ఈ సినిమాకి  తమన్ అందించిన సంగీతం ప్రత్యేకంగా నిలుస్తుందని అంటున్నారు. నిధి అగర్వాల్ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణ అవుతుందని చెబుతున్నారు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.  
Go Back to Shorts
akhil
nidhi agarwal

More Telugu News