Andhra Pradesh: బీజేపీ పేరు ఏపీలో ఎలా ఉండాలో సూచించిన మంత్రి లోకేశ్!

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పేరు ఎలా ఉండాలో మంత్రి నారా లోకేశ్ సూచించారు. గుంటూరు జిల్లా దుర్గి, మాచర్లలో మంగళవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తామంతా పోరాడుతుంటే ప్రతిపక్ష నేత జగన్ మాత్రం నోరు మెదపడం లేదని విమర్శించారు. స్వప్రయోజనాల కోసం రాష్ట్రప్రయోజనాలను మోదీకి తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు.

పవన్ కల్యాణ్‌పైనా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ దత్తపుత్రుడని వ్యంగ్యంగా అన్నారు. ప్రత్యేక హోదా కోసం అవిశ్వాసం పెడితే మద్దతు కూడగడతానన్న పవన్.. ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. ఇక జగన్ అవినీతి పుత్రుడని అన్నారు. ఇద్దరితోనూ అంటకాగుతున్న బీజేపీ తన పేరును ‘భారతీయ జగన్‌మోహన్, పవన్ కల్యాణ్ పార్టీ’గా మార్చుకోవాలని ఎద్దేవా  చేశారు. 
Go Back to Shorts
Andhra Pradesh
Nara Lokesh
Pawan Kalyan
Jagan

More Telugu News