Goutham: హీరోగా మారుతున్న దర్శకుడు గౌతమ్ మీనన్!

షార్ట్స్‌లో చూడండి
తన ప్రతి చిత్రాన్నీ ఒక ప్రత్యేకమైన స్టయిల్ తో తీసే దర్శకుడిగా గౌతమ్ మీనన్ కి పేరుంది. అది ప్రేమ కథయినా, యాక్షన్ సినిమా అయినా తన స్టయిల్ ముద్ర వేస్తారు. అలాంటి గౌతమ్ ఇప్పుడు హీరోగా మారుతున్నాడు. నూతన దర్శకుడు జై ఇటీవల వినిపించిన కథ నచ్చడంతో అందులో హీరోగా నటించడానికి గౌతమ్ అంగీకరించినట్టు సమాచారం.

ఇందులో ఆయన సరసన ఇవానా కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇటీవల వచ్చిన 'గోలీసోడా 2' సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించిన గౌతమ్ మీనన్.. దర్శకుడిగా 'ఘర్షణ', 'ఏ మాయ చేసావే', 'ఎటో వెళ్ళిపోయింది మనసు' వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించారు.   
Go Back to Shorts
Goutham
Gharshana
Ye Maya Chesave

More Telugu News