కాకినాడ బీచ్ చూసేందుకు వచ్చిన జర్మన్ వాసి... ఉన్మాదిగా భావించి తీవ్రంగా కొట్టిన స్థానికులు!
- మద్యం తాగుతూ కనిపించిన మైఖేల్ ప్రాక్టల్
- దాడి చేసిన స్థానిక యువకులు
- ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్మన్ వాసి
విచక్షణా రహితంగా కొట్టడంతో మైఖేల్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. మైఖేల్ పై దాడి చేసిన ఘటనపై కేసు నమోదు చేశామని, ఎవరు దాడి చేశారన్న విషయమై విచారణ జరుపుతున్నామని తెలిపారు.