కరక్కాయల కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్!
- అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు
- బాధితులకు రూ.10 నుంచి 20 కోట్ల మేర కుచ్చుటోపి
- మరికాసేపట్లో మీడియా ముందుకు
వైజాగ్, వరంగల్ సహా పలు ప్రాంతాలకు చెందిన వారిని ఈ ముఠా సిండికేట్ గా ఏర్పడి మోసం చేసింది. ప్రస్తుతం ఈ ముఠాకు సంబంధించి పరారీలో ఉన్నఆరుగురు సభ్యుల్ని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. అరెస్ట్ చేసిన మల్లికార్జున్ రెడ్డి నుంచి పోలీసులు పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
అధికారుల లెక్కల ప్రకారం ఈ ముఠా ప్రజల నుంచి రూ. 10 నుంచి 20 కోట్ల మేర మోసం చేసింది. మరికాసేపట్లో నిందితుల్ని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.