విజయవాడలో ఘోరం... ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి దూకిన శ్రీచైతన్య విద్యార్థిని దేవిశ్రీ
- అనుకున్న స్థాయిలో రాని మార్కులు
- మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం
- తీవ్ర గాయాలతో ఆసుపత్రికి
ఈ ఘటనలో ఆమె తలకు తీవ్రగాయాలు కాగా, స్థానికులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. పటమటలో ఉన్న చైతన్య కాలేజీ భాస్కర్ భవన్ క్యాంపస్ లో ఉంటున్న విద్యార్థినిగా గుర్తించి, ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు.