టీడీపీ ఎంపీల తీరుపై లోక్ సభ స్పీకర్ కు జీవీఎల్ ఫిర్యాదు

  • టీడీపీ ఎంపీలు డ్రామాలాడుతున్నారు
  • పార్లమెంట్ ను అభాసుపాలు చేస్తున్నారు
  • ఆ డ్రామాలకు ఇకనైనా తెరదించాలన్న జీవీఎల్
టీడీపీ నేతలు తనను బెదిరించారంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇప్పటికే సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, టీడీపీ ఎంపీల తీరుపై లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు ఆయన ఫిర్యాదు చేశారు. టీడీపీ ఎంపీలు డ్రామాలాడుతున్నారని, రోజుకో నాటకం, వేషం వేస్తూ పార్లమెంట్ ను అభాసుపాలు చేస్తున్నారని, ఆ పార్టీ ఎంపీలు తమ డ్రామాలకు ఇకనైనా తెరదించాలని కోరుతూ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తూ రాసిన లేఖలో కోరారు.
Go Back to Shorts
Telugudesam
gvl

More Telugu News