తిరుమల భక్తుల కోసం జర్మన్ పందిళ్లు!
- తిరుమలలో తొలిసారిగా జర్మన్ పందిళ్ల ఏర్పాటు
- రూ. 9.5 లక్షల వ్యయంతో ఏర్పాటు
- ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకే
ఒక్కొక్కటి 80 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పు, అంతే ఎత్తుతో ఉండేలా రెండు పందిళ్లను రూ. 9.5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ప్రతి సంవత్సరం వేసవిలో, బ్రహ్మోత్సవాలు, ఇతర పర్వదినాల వేళ మాడ వీధులతో పాటు నారాయణగిరి ఉద్యానవనాల్లో రేకులతో తాత్కాలిక షెడ్ లను అధికారులు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆపై వాటిని తిరిగి తొలగిస్తూ ఉండటంతో ఆర్థిక భారం అధికమవుతోందన్న భావనలో ఉన్న టీటీడీ, జర్మన్ పందిళ్లవైపు మొగ్గు చూపింది.