20 కిలోల బంగారం, వజ్రాభరణాలతో సర్వసంగ పరిత్యాగి యాత్ర... వెంట భారీ భద్రత!
- 25వ సారి కన్వార్ యాత్ర చేస్తున్న గోల్డెన్ పూరీ బాబా
- గత సంవత్సరంతో పోలిస్తే ఐదున్నర కిలోల అదనపు బంగారం
- వెంట సాయుధులైన పోలీసుల భద్రత
గతంలో ఇదే యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన బాబా ఒంటిపై 12 నుంచి 13 కిలోల ఆభరణాలు ఉండేవి. వీటిల్లో వజ్రాలు సహా విలువైన రాళ్లు కూడా పొదిగివుంటాయి. వీటి విలువే రూ. 4 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఇక ఆయన అన్ని వేళ్లకూ ఉంగరాలు, చేతికి రూ. 27 లక్షల రోలెక్స్ వాచ్ నీ ధరించి వుంటాడు. సంవత్సరం గడిచే కొద్దీ ఆయన ఒంటిపై ఉన్న బంగారం బరువు పెరుగుతూ ఉంటుంది. గత సంవత్సరం తన 24వ కన్వార్ యాత్ర చేసిన ఆయన 14.5 కిలోల బంగారం ధరించాడు. ఈ సంవత్సరం 25వ యాత్రకు రూ. 6 కోట్ల విలువైన 20 కిలోల ఆభరణాలతో పాల్గొంటూ అందరినీ ఆకర్షిస్తున్నాడు.