sadhvi-prachi: ముస్లిం అమ్మాయిలు హిందువుల్ని పెళ్లాడాలి.. అప్పుడే బాధలు తప్పుతాయి!: వీహెచ్ పీ నేత సాధ్వీ

  • అప్పుడే ట్రిపుల్ తలాక్ కష్టాలు తప్పుతాయి
  • అయోధ్య రాజకీయ అంశం కాదని వెల్లడి
  • రామాలయ నిర్మాణాన్ని ఎవ్వరూ ఆపలేరన్న సాధ్వీ
ముస్లిం అమ్మాయిలు హిందూ మతం స్వీకరించి హిందూ యువకులను పెళ్లాడాలని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్ పీ) నేత సాధ్వీ ప్రాచీ వ్యాఖ్యానించారు. హిందూ యువకులను పెళ్లాడటం ద్వారా ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా వంటి దురాచారాల నుంచి బయటపడొచ్చన్నారు. మధుర లోని బంకే బిహారి ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. హిందూ మతాన్ని స్వీకరించడం ద్వారా ముస్లిం యువతులు అనేక వేధింపుల నుంచి బయటపడొచ్చని సూచించారు.

కాగా, యూపీలోని ఓ దేవాలయంలోకి ఓ మహిళా ఎమ్మెల్యే వెళ్లినందుకు మందిరంలో గంగా జలంతో శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బిడ్డకు జన్మనిచ్చేందుకు స్త్రీ కావాలి కానీ, దేవాలయంలో పూజలకు మాత్రం ఆమెకు అవకాశం ఉండదా? అని సాధ్వీ ప్రశ్నించారు. మహిళలపై ఇలాంటి వివక్ష ఉండకూడదని అభిప్రాయపడ్డాడు. అయోధ్యలో రామాలయం రాజకీయ అంశం కానేకాదని సాధ్వీ తెలిపారు. ఇది కోట్లాది హిందువుల నమ్మకానికి సంబంధించిన అంశమని ఆమె స్పష్టం చేశారు. రామాలయ నిర్మాణాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని తేల్చిచెప్పారు.
sadhvi-prachi
triple talaq
muslim girls
hindu
conversition
nikha halala
ram mandir

More Telugu News