Uttam Kumar Reddy: తెలంగాణలో ‘కాంగ్రెస్’ అధికారంలోకి రావడం ఖాయం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
2019లో తెలంగాణలో ‘కాంగ్రెస్’ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ‘శక్తి యాప్’పై సమీక్షించారు. ఈ సమీక్షలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం, జానారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ, సామాన్య కార్యకర్తలకు శక్తి నిచ్చేందుకే ‘శక్తి యాప్’ ఏర్పాటు చేశామని, నాయకులు-కార్యకర్తల మధ్య ఈ యాప్ ద్వారా సాంకేతిక అనుసంధానం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే, తెలంగాణలో లక్ష మందికి పైగా ఈ యాప్ లో చేరారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో చిదంబరం పాత్ర మరిచిపోలేమని ఈ సందర్భంగా ఉత్తమ్ ప్రశంసించారు.

చిదంబరం మాట్లాడుతూ, సాంకేతిక అంశాలను కాంగ్రెస్ పార్టీ విరివిగా ఉపయోగించుకోవాలని, ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో కనీసం 25 మంది పార్టీ కార్యకర్తలను ‘శక్తి యాప్’ లో చేర్పించాలని సూచించారు. తెలంగాణలో రాజకీయ ప్రత్యర్థి బలంగా ఉన్నారని, అంతే బలంగా మనం ఎదుర్కోవాలని చిదంబరం అన్నారు.
Go Back to Shorts
Uttam Kumar Reddy
Congress

More Telugu News