'వీర భోగ వసంత రాయలు' నుంచి శ్రీవిష్ణు ఫస్టులుక్
- మల్టీ స్టారర్ మూవీగా 'వీర భోగ వసంత రాయలు'
- నాలుగు ప్రధాన పాత్రల చుట్టూ తిరిగే కథ
- డిఫరెంట్ లుక్స్ తో ఆర్టిస్టులు
ఈ నాలుగు పాత్రల చుట్టూనే కథ తిరుగుతుంది. ఈ సినిమా నుంచి ఒక్కో పాత్రకి సంబంధించిన లుక్ ను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. తాజాగా కొంతసేపటి క్రితం శ్రీవిష్ణు పోస్టర్ ను రిలీజ్ చేశారు. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఈ పోస్టర్ లో శ్రీవిష్ణు కనిపిస్తున్నాడు. తెల్లని గుర్రంతో కూడిన ఈ పోస్టర్ ఆయన పాత్రలోని కొత్తదనానికి అద్దం పడుతోంది. మొత్తానికి ఈ సినిమా పోస్టర్స్ తోనే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందరికి ఈ సినిమాను గురించి చర్చించుకునేలా చేస్తోంది. టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగే అవకాశాలు వున్నాయనే టాక్ బలంగా వినిపిస్తోంది.