vijay devarakonda: విజయ్ దేవరకొండ పాటపై అభ్యంతరాలు .. తొలగింపు!

  • ప్రేమ కథాంశంగా 'గీత గోవిందం'
  • విజయ్ దేవరకొండ జోడీగా రష్మిక 
  • పాటలోని కొన్ని పాదాలపై అభ్యంతరాలు       

'గీత గోవిందం' సినిమా కోసం విజయ్ దేవరకొండ ఒక పాట పాడాడు. తొలిసారిగా విజయ్ పాడిన ఈ పాట లిరికల్ వీడియోను నిన్న మధ్యాహ్నం విడుదల చేశారు. తొలిసారే అయినా విజయ్ దేవరకొండ ఈ సాంగ్ ను తనదైన స్టైల్లో పాడేశాడు. అయితే ఈ తరం అమ్మాయిల ధోరణిని గురించి ఈ పాటలో ప్రస్తావించారు. అంతేకాదు ఇతిహాసాలు .. పురాణాల్లోని విషయాలను కూడా ఈ తరానికి తేలికగా అన్వయించేశారు.

ఈ నేపథ్యంలోనే పాటలోని కొన్ని పాదాల పట్ల చాలామంది నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొన్ని పాదాలు తమ మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. వాటి ఫలితమే ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ పాట వీడియోను కనిపించకుండా చేసింది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతోన్న వేళ .. అనవసరమైన వివాదాల జోలికి వెళ్లకూడదనే ఉద్దేశంతోనే, ఈ పాటను యూట్యూబ్ నుంచి తొలగించినట్టుగా చర్చించుకుంటున్నారు. విజయ్ దేవరకొండ పాడిన మొదటి పాటే అభ్యంతరాలతో ఆగిపోవడం గురించి మాట్లాడుకుంటున్నారు.      

More Telugu News