గ్రీస్‌లో పెను విషాదం.. వెంటాడుతున్న కార్చిచ్చు.. 74 మంది మృతి!
- గ్రీస్‌లో కొనసాగుతున్న దావానలం
- వేర్వేరు చోట్ల పలువురి మృతి
- శరవేగంగా విస్తరిస్తున్న మంటలు
మంటలను అదుపు చేసేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 2007లో సంభవించిన కార్చిచ్చులో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మళ్లీ దావానలం రేగడం ఇదే తొలిసారి. కార్చిచ్చుతో భయభ్రాంతులకు గురైన సమీప ప్రాంతాల ప్రజలు గ్రామాలను ఖాళీ చేస్తున్నారు. కార్చిచ్చు చెలరేగడానికి గల కారణాలు తెలియరాలేదు. గ్రీస్ ప్రధాని అలెక్సిస్ టిసిప్రాస్ మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు.