దేశ ఆర్ధికమంత్రి నిద్రపోతున్నారా...?: బాంబే హైకోర్ట్ తీవ్ర ఆగ్రహం
- నెలరోజులుగా పనిచేయని ముంబైలోని డీఆర్ టీ
- హైకోర్టును ఆశ్రయించిన డీఆర్ టీ బార్ అసోసియేషన్
- కేంద్ర ప్రభుత్వానికి తలంటిన హైకోర్టు
ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన జస్టిస్ ఏ ఎస్ ఓకా, జస్టిస్ రియాజ్ చాగ్లాతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. డీఆర్ టీ కోసం ప్రత్యామ్నాయ భవనాన్ని కేంద్రప్రభుత్వం ఎప్పుడు గుర్తిస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నామని వ్యాఖ్యానించింది. సమస్య తమ దృష్టికి రాకముందే, ఆదేశాలు ఇవ్వకముందే.. కేంద్రప్రభుత్వం తనకు తానుగా ఈ పనిచేసి ఉండాల్సిందని జస్టిస్ ఓకా అన్నారు. దేశ ఆర్ధిక రాజధానిలో రుణాల రికవరీ ట్రైబ్యునల్ కార్యాలయం మూసి ఉందంటే ఆర్ధిక మంత్రి నిద్రపోతున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసిన హైకోర్టు అప్పటిలోగా ట్రైబ్యునల్ కు మరో భవనం కేటాయించాలని ఆదేశించింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాల ఎగవేతదారులకు సంబంధించిన ఫిర్యాదులను డీఆర్ టీ పరిశీలిస్తుంది.