raviteja: మరోసారి ద్విపాత్రాభినయం చేయనున్న రవితేజ

షార్ట్స్‌లో చూడండి
ప్రస్తుతం రవితేజ .. శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా తరువాత సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'తెరి' రీమేక్ లో రవితేజ చేయవలసి వుంది. కానీ కొన్ని కారణాల వలన నిర్మాతలు ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశారు. దాంతో రవితేజ తన తదుపరి సినిమాను వీఐ ఆనంద్ తో చేయనున్నట్టు తెలుస్తోంది.

ఇటీవల ఆయన రవితేజకి కథను వినిపించడం .. అది కొత్తగా ఉండటంతో రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని అంటున్నారు. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. రెండు పాత్రల మధ్య చాలా వైవిధ్యం ఉంటుందనీ .. ఆ వైవిధ్యం ఆడియన్స్ ను కట్టిపడేయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఇంతకుముందు రవితేజతో 'నేల టికెట్' తీసిన నిర్మాతలే ఈ సినిమాకి కూడా నిర్మాతలుగా వ్యవహరించనున్నారని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.  
Go Back to Shorts
raviteja

More Telugu News