Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • భర్తతో కలసి యాడ్ చేసిన సమంత! 
  • ప్రముఖ సంస్థ చేతిలో 'సాక్ష్యం' హక్కులు 
  • పోలీసాఫీసర్ పాత్రలో డాక్టర్ రాజశేఖర్

* సమంత, నాగ చైతన్య జంట కలసి ఓ ప్రోడక్ట్ కి ప్రచారకర్తలుగా పనిచేస్తున్నారు. ప్రముఖ సోప్ 'రెగ్జోనా'కు వీరిద్దరూ కలసి బ్రాండ్ అంబాసడర్స్ గా వ్యవహరించనున్నారు. ఇందుకు సంబంధించిన టీవీ కమర్షియల్ షూటింగును తాజాగా వీరిద్దరిపైనా ముంబయ్ లో నిర్వహించారు.  
*  బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటించిన 'సాక్ష్యం' చిత్రం వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఎరోజ్ ఇంటర్నేషనల్ సంస్థ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ నెల 27న రిలీజ్ చేస్తున్నారు.
*  ఆమధ్య 'గరుడవేగ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రముఖ నటుడు డాక్టర్ రాజశేఖర్ మళ్లీ ఇప్పుడు మరో చిత్రాన్ని చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించే ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లో రాజశేఖర్ పోలీసాఫీసర్ పాత్రను పోషిస్తారు. 

More Telugu News