modi: మోదీని రాహుల్ ఆలింగనం చేసుకున్న తీరు గౌరవప్రదంగా లేదు: స్పీకర్ సుమిత్రా మహాజన్

షార్ట్స్‌లో చూడండి
ప్రధాని మోదీన రాహుల్ గాంధీ ఆలింగనం చేసుకున్న తీరు గౌరవప్రదంగా లేదని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వ్యాఖ్యానించారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా ప్రసంగిస్తున్న బీజేపీ ఎంపీ రాజ్ నాథ్ సింగ్ ప్రసంగానికి టీడీపీ సభ్యులు అడ్డుతగిలారు. పోడియం వద్దకు వెళ్లి టీడీపీ ఎంపీలు నినాదాలు చేశారు. సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడటంతో లోక్ సభను 4.30 గంటలకు వాయిదా వేస్తున్నట్టు ఆమె ప్రకటించారు.

 సభ తిరిగి ప్రారంభమైన అనంతరం, సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ, సభలోని సభ్యులంతా సంప్రదాయాలు పాటించాలని, ప్రధాని స్థానంలో ఎవరున్నా, ఆ స్థానాన్ని గౌరవించాలని సూచించారు. మోదీని రాహుల్ ఆలింగనం చేసుకున్న సమయంలో అసలు సభలో ఏం జరుగుతుందో తనకు అర్థం కాలేదని అన్నారు.
Go Back to Shorts
modi
sumitra
rahul

More Telugu News