kcr: ఓ సాధువును గూండాలా ట్రీట్ చేస్తారా?: టీ-సర్కార్ పై సుబ్రహ్మణ్య స్వామి మండిపాటు

షార్ట్స్‌లో చూడండి
శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరించిన విషయమై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. గూండాలను బహిష్కరించేందుకు ఉన్న చట్టాన్ని పరిపూర్ణానందపై ఎలా ప్రయోగిస్తారని ప్రశ్నిస్తూ సీఎం కేసీఆర్ కు ఓ బహిరంగ లేఖ రాశారు. చట్టాన్ని పోలీసులు సరిగా అర్థం చేసుకోలేదా? అని ప్రశ్నించిన సుబ్రహ్మణ్య స్వామి, పరిపూర్ణానందపై విధించిన బహిష్కరణ ఉత్తర్వులను తక్షణం రద్దు చేయాలని కోరారు.

 ఓ సాధువును గూండాలా ట్రీట్ చేస్తారా? పరిపూర్ణానందను నగర బహిష్కరణ చేయడమంటే ఆయన్ని తీవ్రంగా అవమానించడమేనని, ఆయన గౌరవ మర్యాదలకు భంగం కలిగిందని మండిపడ్డారు. నగర బహిష్కరణ కారణంగా పరిపూర్ణానంద హక్కులకు భంగం కలిగిందని, తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తోందని ఆ లేఖలో విమర్శించారు.
Go Back to Shorts
kcr
subramanya swamy

More Telugu News