అప్పుడు ముమైత్ ఖాన్ కు జరిగింది.. ఇప్పుడు బాబు గోగినేనికి జరగనుంది!
- బాబు గోగినేనిపై మాదాపూర్ పీఎస్ లో కేసు నమోదు
- దేశద్రోహం, మతాలను అవమానించడం తదితర అభియోగాలతో కేసు
- 25వ తేదీలోగా కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలంటూ కోర్టు ఆదేశం
గత నెలలో మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో బాబు గోగినేనిపై కేసు నమోదైంది. దేశద్రోహం... మతాలు, కులాలు, వర్గాల పేరిట ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, మత విశ్వాసాలను అవమానించడం తదితర తీవ్రమైన అభియోగాలతో పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. కేసు నమోదైనప్పటికీ దర్యాప్తులో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ కేసు పెట్టిన వ్యక్తి కోర్టును ఆశ్రయించారు.
దీంతో, ఈనెల 25లోగా కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలంటూ పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒకటి, రెండు రోజుల్లో బిగ్ బాస్ షో నిర్వాహకులకు నోటీసులు అందించి, బాబు గోగినేనిని విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. విచారణ పూర్తయిన తర్వాత ఆయన మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారు.