పోర్న్ వీడియో చూసి 8 ఏళ్ల బాలికను రేప్ చేసిన ఐదుగురు బాలలు
- ఘటనకు ముందు రెండు రోజులు ‘పోర్న్’ వీక్షణ
- ఆడుకుందామని నమ్మించి అత్యాచారం
- నిందితుల అరెస్ట్
స్థానికంగా నివసించే బాలురు, ఆడుకుందామని బాలికను నమ్మించి ఓ స్నేహితుడి ఇంట్లోకి తీసుకెళ్లి ఈ దుర్మార్గానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు రెండు రోజుల ముందు ఫోన్‌లో పోర్న్ సినిమా చూసినట్టు నిందితుల్లో ఒకడైన బాలుడు చెప్పాడు. అనంతరం బాలికపై అత్యాచారానికి ప్లాన్ చేసినట్టు వివరించాడు.
నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు సాహస్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ నరేశ్ రాథోడ్ తెలిపారు. ఆదివారం బాలలను అదుపులోకి తీసుకుని జువైనల్ కోర్టులో ప్రవేశపెట్టినట్టు తెలిపారు.