నా భార్య, అత్తింటివారు నన్ను టార్చర్ పెడుతున్నారు: సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఫిర్యాదు
- రూ. 30 లక్షల ఆభరణాలు కొనివ్వాలంటూ భార్య డిమాండ్
- రూ. 2 కోట్లు ఇవ్వాలంటూ అత్తామామల వేధింపులు
- బెంగుళూరులో తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు టార్చర్
అంతేకాదు, రూ. 2 కోట్లు ఇవ్వాలంటూ అత్తింటివారు డిమాండ్ చేస్తున్నారని ధీరజ్ వాపోయాడు. అడిగిన డబ్బు ఇవ్వకపోతే... అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్టు కేసు పెడతామని బెదిరించారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నాడు. తన భార్య సిగరెట్లు, మందు తాగుతుందని... ఈ విషయంపై అత్తామామలకు ఫిర్యాదు చేయగా... వారు ఆమెకే మద్దతు పలుకుతున్నారని... తమ కూతురు చెప్పినట్టు వినాలని బెదిరిస్తున్నారని తెలిపాడు. వీరి టార్చర్ భరించలేకపోతున్నానని చెప్పాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, జయశ్రుతితో పాటు ఆరుగురికి నోటీసులు జారీ చేశారు.