ఏడాది పాటు వీసా ఫ్రీ ఎంట్రీ: రష్యా వెళ్లిన ఫుట్ బాల్ అభిమానులకు బంపరాఫర్ ఇచ్చిన పుతిన్!
- 'ఫ్యాన్ ఐడీ' ఉంటే వీసా ఉచితం
- ఈ సంవత్సరం చివరి వరకూ వచ్చిపోవచ్చు
- రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
ఫుట్ బాల్ మ్యాచ్ చూసేందుకు టికెట్ కొనుగోలు చేసిన విదేశీయులు, దేశంలో దిగగానే ఈ 'ఫ్యాన్ ఐడీ' ఇస్తారు. ఈ ఐడీలు మామూలుగా అయితే, ఈ నెల 25తో ఎక్స్ పైర్ అయిపోతాయి. ఇప్పుడీ ఫ్యాన్ ఐడీ చూపించి, సంవత్సరం చివరి వరకూ ఎన్నిసార్లయినా పర్యటించవచ్చని తెలిపారు. రష్యాకు, పశ్చిమ దేశాలకు మధ్య ద్వైపాక్షిక ఉద్రిక్తతలు నెలకొని ఉన్నప్పటికీ, పలు దేశాధినేతలు మ్యాచ్ లు చూసేందుకు వచ్చిన సంగతి తెలిసిందే.