rajanikanth: జమిలి ఎన్నికలు చాలా మంచి ఆలోచన: రజనీకాంత్

షార్ట్స్‌లో చూడండి
జమిలి ఎన్నికలు చాలా మంచి ఆలోచన అని త్వరలో రాజకీయాల్లోకి రానున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. చెన్నైలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘వన్ నేషన్ వన్ పోల్’ ఆలోచన మంచిదేనని, జమిలి ఎన్నికల వల్ల డబ్బు, సమయం రెండూ ఆదా అవుతాయని, ఈ ఎన్నికలకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు.

సార్వత్రిక ఎన్నికల్లో తాము పోటీ చేసే అంశంపై తర్వాత నిర్ణయం తీసుకుంటానని అన్నారు. తమిళనాడు అవినీతి మయమైపోయిందని బీజేపీ నేత అమిత్ షా చేసిన ఆరోపణల విషయమై ప్రశ్నించగా, రజనీ స్పందిస్తూ.. అది అమిత్ షా అభిప్రాయమని, ఈ విషయం గురించి ఆయన్నే అడగాలని చెప్పారు.
Go Back to Shorts
rajanikanth
simaltaneous elections

More Telugu News