మీడియా సహకరించడం లేదు.. జనాల్లోకి వెళ్లి మేమే చెబుతాం: పురందేశ్వరి
- కేంద్రం ఎంతో సాయం చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది
- క్షేత్ర స్థాయికి వెళ్లి కేంద్రం చేస్తున్న సాయాన్ని వివరిస్తాం
- త్వరలోనే ఎయిమ్స్ నిర్మాణం పూర్తికానుంది
ఎయిమ్స్ నిర్మాణానికి నిధులు ఇవ్వడం లేదని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అంటున్నారని... త్వరలోనే ఎయిమ్స్ నిర్మాణం పూర్తికానుందని అన్నారు. జనవరి నుంచి ఎయిమ్స్ లో ఓపీ సేవలు ప్రారంభమవుతాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెరగకపోయినా... ముంపు ప్రాంతం పెరిగిందనే సాకు చూపుతూ, నష్ట పరిహారం చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు అడుగుతోందని మండిపడ్డారు.