పీడీపీని ముక్కలు చేయాలనుకుంటే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి: బీజేపీని హెచ్చరించిన మెహబూబా ముఫ్తీ
- మా పార్టీ జోలికి వస్తే చూస్తూ ఊరుకోం
- ప్రజాస్వామ్య వ్యవస్థపై కశ్మీర్ ప్రజలకు నమ్మకం పోతుంది
- బీజేపీకి వార్నింగ్ ఇచ్చిన మెహబూబా ముఫ్తీ
ప్రస్తుతం అక్కడ గవర్నర్ పాలన కొనసాగుతోంది. మరోవైపు, పీడీపీలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలను తమవైపు లాక్కుని, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా బీజేపీ ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే మెహబూబా ముఫ్తీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పీడీపీలో చీలిక తెచ్చేందుకు బీజేపీ యత్నిస్తే... భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై కశ్మీర్ ప్రజలకు నమ్మకం పోతుందని మెహబూబా అన్నారు.