తమపై వస్తున్న అసత్య వార్తలను ఎద్దేవా చేస్తూ... దర్శకుడితో కలిసి అఖిల్ వీడియో!
- వెంకీ అట్లూరీ దర్శకత్వంలో అఖిల్ సినిమా
- వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని గాసిప్స్
- సినిమా ఆగిపోయే ప్రమాదం ఉందని వార్తలు
- విభేదాలు వచ్చినట్లు నటించి బిగ్గరగా నవ్విన వెంకీ, అఖిల్
అంతేగాక ఈ సినిమా ఆగిపోయే అవకాశం కూడా ఉందని ఊహాజనితంగా పలు వెబ్‌సైట్లు రాసుకొచ్చాయి. వాటిని గుర్తించిన అఖిల్, వెంకీ అటువంటి వార్తలను ఎద్దేవా చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. 'మీరే డైరెక్టురుగా.. ముందుగా మీరే మాట్లాడండి.. మీరు హీరోగా మీరే మాట్లాడండి' అంటూ ఇరువురు నిజంగానే గొడవ పడుతున్నట్లు ఆ వీడియో ఉంది. చివరికి వారిద్దరూ బిగ్గరగా నవ్వారు.