kalyan dev: చిరూ చిన్నల్లుడు మంచి మార్కులే కొట్టేశాడు!

షార్ట్స్‌లో చూడండి
చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా చేసిన 'విజేత' సినిమా, ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా మాళవిక నాయర్ నటించింది. చిరంజీవి చిన్నల్లుడు ఎలా చేశాడో చూద్దామనే కుతూహలంతో థియేటర్స్ కి వెళ్లినవాళ్లు తమ స్పందనను తెలియజేస్తున్నారు.

" రామ్ పాత్రలో కల్యాణ్ దేవ్ లుక్స్ పరంగా ఆకట్టుకున్నాడు. జీవితం పట్ల బాధ్యత అనేది లేకుండా తిరిగే సందర్భాల్లోను .. తండ్రి బాధను అర్థం చేసుకున్న సందర్భంలోను .. తనని తాను సరి చేసుకునే సమయంలోను .. ప్రేమకి సంబంధించిన సన్నివేశాల్లోను సగటు కుర్రాడిగా కల్యాణ్ దేవ్ చక్కగా నటించాడని అంటున్నారు. కల్యాణ్ దేవ్ కి ఇది మొదటి సినిమానే అయినా, ఆడియన్స్ కి ఎక్కడా ఆ ఫీలింగ్ రాకుండా చేశాడని చెబుతున్నారు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను ఎంచుకుని చేస్తూ వెళితే, త్వరలోనే దార్లోపడిపోతాడనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.   
Go Back to Shorts
kalyan dev
malavika

More Telugu News