రాత్రి నుంచి దంచికొడుతున్న వాన... తెరచుకున్న తెలంగాణ ప్రాజెక్టుల గేట్లు!
- తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం
- ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
- తెరచుకున్న ప్రాజెక్టుల గేట్లు
మరోవైపు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు తోడు, గోదావరి పరీవాహక ప్రాంతంలో పడుతున్న వర్షాలకు నదిలో వరదనీరు మరింత ఎక్కువైంది. తెలంగాణలోని పలు ప్రాజెక్టుల గేట్లను అధికారులు తెరచారు. కడెం ప్రాజెక్టుకు చెందిన మూడు గేట్లను ఎత్తారు. 700 అడుగుల నీటిమట్టం ఉండే ఈ రిజర్వాయర్ లో ఇప్పటికే 698 అడుగుల నీరు చేరడంతో వచ్చిన నీటిని వచ్చినట్టు కిందకు వదులుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కొమురం భీం ప్రాజెక్టుకు వరద పోటు ఎక్కువగా ఉండటంతో మూడు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మరింతగా పెరిగింది.