Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'సీమరాజా'కు డబ్బింగ్ పూర్తి చేసిన సమంత
  • 'దేవదాస్'కి కొత్త రిలీజ్ డేట్ 
  • జోరు మీదున్న 'పందెం కోడి 2'  


 *  ఇటీవల కాలంలో చెన్నయ్ బ్యూటీ సమంత తమిళంలో నటించే తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటోంది. ఈ క్రమంలో తన తాజా చిత్రం 'సీమరాజా'కు తాజాగా డబ్బింగ్ పూర్తి చేసింది. ఇందులో శివ కార్తికేయన్ హీరోగా నటించాడు.
*  నాగార్జున, నాని హీరోలుగా 'దేవదాస్' పేరిట ఓ మల్టీ స్టారర్ రూపొందుతున్న సంగతి విదితమే. శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇందులో నాగార్జున డాన్ గా, నాని డాక్టర్ గా నటిస్తున్నారు.
*  విశాల్ హీరోగా నటిస్తున్న 'పందెం కోడి 2' చిత్రం షూటింగ్ ప్రస్తుతం తమిళనాడులోని కారైకుడిలో జరుగుతోంది. అక్టోబర్ 18న తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. 

More Telugu News