హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

  • ఎల్బీనగర్‌, మన్సూరాబాద్‌, నాగోల్‌ ప్రాంతాల్లో భారీ వర్షం
  • ఖైరతాబాద్‌, ఎస్సార్‌ నగర్‌, యూసఫ్‌గూడల్లో మోస్తరు వాన
  • తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఎల్బీనగర్‌, మన్సూరాబాద్‌, నాగోల్‌, మోహన్‌ నగర్‌, కొత్తపేట్‌, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్‌, హయత్‌నగర్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. నాంపల్లి, ఖైరతాబాద్‌, ఎస్సార్‌ నగర్‌, యూసఫ్‌గూడతో పాటు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడుతోంది. పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇరు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షం పడుతోంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
Go Back to Shorts
Hyderabad
rain

More Telugu News