ఆ వీడియో ఎవరు తీశారో గుర్తించాం: 'బరువు తగ్గాలనుకుంటే దీక్ష'పై మురళీ మోహన్
- అది కోవర్టు ఆపరేషన్ కాదు
- సరదాగా మాట్లాడుకున్నవి కెమెరాకు చిక్కితే విపరీత అర్థాలు
- ఆ ఘటన తరువాత జాగ్రత్తగా మాట్లాడుకుంటున్నాం
ఈ విషయంపై మురళీ మోహన్ తాజాగా స్పందించారు. ఆ వీడియో ఎవరు తీశారో తాము గుర్తించామని, ఇది కోవర్టు ఆపరేషన్ మాత్రం కాదని మురళీ మోహన్ అన్నారు. ఆ ఘటన తరువాత సరదాగా మాట్లాడుకున్నవి కూడా కెమెరాకు చిక్కితే విపరీత అర్థాలు వస్తాయని గుర్తించామని, అప్పటి నుంచి కాస్త జాగ్రత్తపడాల్సి వస్తోందని అన్నారు.